USA: అమెరికా సంచలన నిర్ణయం... ముంబైకి విమానాలు రద్దు!

  • అమెరికా డ్రోన్ ను కూల్చిన ఇరాన్
  • ఇరాన్ గగనతలాన్ని వాడే విమానాలన్నీ రద్దు
  • ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని వినతి

డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. న్యూయార్క్ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో యునైటెడ్ ఎయిర్ లైన్స్ నడపాల్సిన విమానాలు రద్దు కాగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ గగనతలంలోకి అమెరికా డ్రోన్ ప్రవేశించిందంటూ, ఇరాన్ ఆ డ్రోన్ ను కూల్చివేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

దీంతో ఇరాన్‌ గగనతలం మీదుగా అమెరికా విమానాలు వెళ్లవద్దని యూఎస్ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ఏవియేషన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించారు. విమానాల రద్దు ఎంతకాలమో మాత్రం చెప్పలేదు. కాగా, యునైటెడ్ ఎయిర్ లైన్స్ తో పాటు అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌, డెల్టా ఎయిర్‌ లైన్స్‌ కూడా ఇరాన్‌ మీదుగా తాము నడిపే విమానాలను రద్దు చేసుకున్నాయి.

More Telugu News