KCR: కేసీఆర్ అపర భగీరథుడు.. రైతులకు శిరసు వంచి నమస్కరిస్తున్నా: హరీశ్ రావు

  • తెలంగాణ ప్రజల పోరాట ఫలితమే ‘కాళేశ్వరం’
  • కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ వల్లే త్వరగా పూర్తయింది
  • కష్టపడిన అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు అపర భగీరథుడితో పోల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకోని హరీశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంజినీర్‌లా మారి ప్రాజెక్టును రీడిజైన్ చేశారని కొనియాడారు. ఆయన నిరంతర పర్యవేక్షణ, కృషి వల్లే ప్రాజెక్టు త్వరగా పూర్తయిందన్నారు. ప్రాజెక్టును తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా హరీశ్ అభివర్ణించారు.

 ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మహారాష్ట్రతో ఏర్పడిన వివాదాన్ని స్నేహపూర్వకంగా పరిష్కరించారంటూ కేసీఆర్‌ను హరీశ్ కొనియాడారు. ప్రాజెక్టు నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రైతుల పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.  

More Telugu News