sensex: నష్టాలతో ప్రారంభమై... భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 489 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 140 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 11 శాతం వరకు లాభపడ్డ యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ రంగ షేర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో... మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602కి ఎగబాకింది. నిఫ్టీ 140 పాయింట్లు లాభపడి 11,832 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (10.94%), సన్ ఫార్మా (4.01%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.80%), ఎల్ అండ్ టీ (3.36%), ఐసీఐసీఐ బ్యాంక్ (3.20%).

టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-0.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.16%), ఐటీసీ (-0.07%), ఎన్టీపీసీ (-0.04%).

More Telugu News