కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఉత్తమ్ స్పందన

20-06-2019 Thu 15:35
  • ఆర్థిక లేదా రాజకీయ కారణాలతో పార్టీని వీడే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు
  • పార్టీని కోమటిరెడ్డి ఎందుకు వీడాలనుకుంటున్నారో   నాకు చెప్పారు
  • ఏఐసీసీ పెద్దలతో చర్చిస్తా
టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆర్థికపరమైన కారణాలతో లేదా రాజకీయపరమైన కారణాలతో పార్టీని వీడి వెళ్లే వారికైతే ఏదైనా చెప్పొచ్చని అన్నారు. కానీ, రాజగోపాల్ రెడ్డి ఏ కారణాల వల్ల బయటకు వెళ్లాలనుకుంటున్నారో తనకు చెప్పారని వ్యాఖ్యానించారు. ఏఐసీసీ పెద్దలతో చర్చించాక మరోసారి ఈ విషయమై మాట్లాడతానని అన్నారు.