kaleswaram project: ‘కాళేశ్వరం’కు జాతీయ హోదా ఎందుకివ్వరని ఎప్పుడైనా అడిగారా?: తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి శ్రీనివాసగౌడ్‌ ఫైర్

  • తెలంగాణ పట్ల బాధ్యత లేనట్టుగా ప్రవర్తిస్తున్నారు
  • కేంద్రం సహకరించకపోయినా ప్రాజెక్టు నిర్మించాం
  • ఏవో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి ఎగిరిపడుతున్నారు

ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం సంతోషమే కానీ, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు కల్పించరని కేంద్రాన్ని బీజేపీ నేతలు ఎప్పుడైనా అడిగారా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ పట్ల బాధ్యత లేనట్టుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడాన్ని టీ-బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్రాలకు సహజంగా ఇచ్చే అనుమతులనే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది తప్ప, రాష్ట్రానికి అంతకు మించి చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో ఏవో నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News