ips: ఐపీఎస్ అధికారి భట్ కు యావజ్జీవ శిక్ష విధించిన జామ్ నగర్ కోర్టు!

  • కస్టోడియల్ డెత్ కేసులో యావజ్జీవం
  • మోదీ మతఘర్షణలు రెచ్చగొట్టారని భట్ ఆరోపణ
  • భట్ ఆరోపణలు తప్పని తేల్చిన సుప్రీంకోర్టు

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడిన గుజరాత్ కేడర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ కు షాక్ తగిలింది. 30 ఏళ్ల నాటి కస్టోడియల్ డెత్ కేసులో సంజీవ్ భట్ ను గుజరాత్ లోని జామ్ నగర్ కోర్టు దోషిగా తేల్చింది. ఆయనకు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చింది. 2002లో గుజరాత్ మత ఘర్షణల సందర్భంగా అల్లర్లు తీవ్రతరం అయ్యేలా అప్పటి సీఎం మోదీ వ్యవహరించారని సంజీవ్ భట్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

గోద్రా రైలు దహనం అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో నిర్వహించిన భేటీలో ‘హిందువులను తమ కోపం తీర్చుకోనివ్వండి’ అని అప్పటి గుజరాత్ సీఎం మోదీ చెప్పినట్లు ఆరోపించారు. ఈ సమావేశానికి తాను కూడా వెళ్లానని చెప్పారు. అయితే సుప్రీంకోర్టు విచారణలో భట్ ఆరోజు సీఎం మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరుకాలేదని తేలింది. మరోవైపు అనుమతి తీసుకోకుండా విధులకు గైర్హాజరు కావడం, అధికారిక వాహనాలను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు రావడంతో భట్ ను 2011లో సస్పెండ్ చేశారు. 2015లో ఆయన్ను సర్వీసు నుంచి తప్పించారు. 

More Telugu News