ప్రతీఒక్కరూ బాల్యం నుంచే యోగాను నేర్చుకోవాలి: హేమమాలిని

20-06-2019 Thu 13:02
  • మనిషి జీవితంలో యోగా చాలా ముఖ్యమైంది
  • దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం  చేకూరుతుంది
  • పార్లమెంటు వద్ద మీడియాతో బీజేపీ నేత
మనిషి జీవితంలో యోగా చాలా ముఖ్యమైనదని బీజేపీ లోక్ సభ సభ్యురాలు, నటి హేమమాలిని తెలిపారు. అలాంటి యోగాను ఎవరు వ్యతిరేకిస్తారని ఆమె ప్రశ్నించారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో హేమమాలిని పార్లమెంటు దగ్గర మీడియాతో మాట్లాడుతూ, యోగాను ప్రతీఒక్కరూ చేయాలని సూచించారు.

దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతీఒక్కరూ బాల్యం నుంచే యోగాను నేర్చుకోవాలనీ, చిన్నపిల్లలకు యోగాను నేర్పాలని సూచించారు. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో హేమమాలిని ఉత్తరప్రదేశ్ లోని మధుర లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.