సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Thu, Jun 20, 2019, 07:18 AM
  • తమన్నా పాత్ర నెగటివ్ కాదట!
  • మళ్లీ 'మిస్టర్ పెర్ఫెక్ట్' కాంబినేషన్ 
  • రాజ్ తరుణ్ చిత్రంలో అదితీరావు
*  చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'సైరా' చిత్రంలో తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను చేస్తున్నట్టుగా కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదని, ఆమె ఓ యువరాణి పాత్రను పోషిస్తోందని తాజా సమాచారం.
*  ప్రభాస్, దిల్ రాజు కాంబినేషన్లో ఎనిమిదేళ్ల క్రితం 'మిస్టర్ పెర్ఫెక్ట్' చిత్రం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకి వీరి కలయికలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కి సరిపోయే కథను తయారుచేయించే పనిలో నిర్మాత దిల్ రాజు ఉన్నాడట.
*  యువ కథానాయిక అదితీరావు హైదరి త్వరలో రాజ్ తరుణ్ సరసన నటించే అవకాశం కనిపిస్తోంది. కొండా విజయకుమార్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయిక పాత్ర కోసం అదితీరావును సంప్రదిస్తున్నారట.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad