Narendra Modi: జమిలి ఎన్నికలపై విపక్షాలతో సంప్రదింపులు ఒక కృత్రిమ ప్రయత్నం: సీతారాం ఏచూరి

  • ఒకేసారి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం
  • సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం
  • అప్పుడు మాత్రమే ప్రభుత్వం వైదొలగాల్సి ఉంటుంది

ప్రధాని మోదీ నేతృత్వంలో నేడు జమిలి ఎన్నికలపై విపక్షాలతో భేటీ జరిగింది. దీనిపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందించారు. నేడు ఆయన న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటుతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జమిలి ఎన్నికలపై విపక్షాలతో సంప్రదింపులు కూడా కృత్రిమ ప్రయత్నమని విమర్శించారు. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనుకోవడాన్ని సమాఖ్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా సీతారాం ఏచూరి అభివర్ణించారు.  

More Telugu News