గేలి చేసిన నెటిజన్‌కు సమంత దిమ్మతిరిగే కౌంటర్!

Wed, Jun 19, 2019, 05:54 PM
  • ‘ఓ బేబీ’ తమిళ్ వర్షన్‌కు డబ్బింగ్ చెప్పిన చిన్మయి
  • డబ్బింగ్ చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేసిన సామ్
  • మూవీ పక్కా ప్లాప్ అంటూ నెటిజన్ ట్వీట్
‘ఓ బేబీ’ సినిమా పక్కా ప్లాప్ అవుతుందంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేసిన ఓ నెటిజన్ కు తనదైన శైలిలో ప్రముఖ నటి సమంత సమాధానం ఇచ్చింది. సాధారణంగా సామ్ సినిమాలన్నింటికీ ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెబుతూ ఉంటారు. అలాగే ‘ఓ బేబీ’ చిత్రం తమిళ్ వర్షన్‌కు కూడా చిన్మయి డబ్బింగ్ చెప్పారు. ఈ విషయాన్ని సామ్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తమిళంలో చిన్మయి డబ్బింగ్ చెప్పినందుకు సంతోషం వ్యక్తం చేసింది.

దీనిపై స్పందించిన ఓ అమ్మాయి చాలా సంతోషంగా ఉందని, దర్శకురాలు నందినిరెడ్డి, సమంతల కాంబినేషన్‌పై అంచనాలు ఎక్కువగానే ఉంటాయని పేర్కొంది. ‘ఓ బేబీ’ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొంది. ఈ ట్వీట్లను చూసిన కిరు అనే అనే నెటిజన్, ‘ఫెమినిస్ట్‌లందరూ ఒకే దగ్గర ఉన్నారుగా.. మూవీ పక్కా ప్లాప్’ అని కామెంట్ చేశాడు. దీనిపై సామ్ స్పందిస్తూ, ‘హాహా.. థాంక్యూ.. ప్రపంచం ఒక మూర్ఖుడిని కలిసింది.. మూర్ఖుడు ప్రపంచాన్ని కలిశాడు’ అని సమాధానమిచ్చింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad