TV9: హీరో శివాజీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు

  • ‘టీవీ 9’ లో అక్రమాలకు పాల్పడిన కేసు
  • తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరిన శివాజీ
  • ఈ కేసు తదుపరి విచారణ 26కు వాయిదా 

‘టీవీ 9’లో అక్రమాలకు పాల్పడినట్టు కొత్త యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినప్పటి నుంచీ హీరో శివాజీ అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపినా శివాజీ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టును శివాజీ ఆశ్రయించాడు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, తనను పోలీసులు ముందస్తు అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పై న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

More Telugu News