sensex: ఒడిదుడుకుల మధ్య స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్

  • ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయిన మార్కెట్లు
  • 66 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 5 శాతం పైగా నష్టపోయిన యస్ బ్యాంక్

ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో దాదాపు 555 పాయింట్లు పతనమైన సెన్సెక్స్... ఆ తర్వాత కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ తదితర కంపెనీల అండతో పుంజుకుని... చివరకు లాభాల్లో ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 39,113కు పెరిగింది. నిఫ్టీ 0.05 పాయింట్లు నష్టపోయి 11,691 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (4.60%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.44%), ఎన్టీపీసీ (1.58%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.11%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.06%), ఓఎన్జీసీ (0.75%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.54%), టాటా మోటార్స్ (-2.31%), హీరో మోటో కార్ప్ (-1.99%),  ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.82%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.71%).

More Telugu News