all parties meet: మోదీ అఖిల పక్ష సమావేశం...టీడీపీ దారిలోనే మరికొందరు?

  • హాజరుకాకూడదని నిర్ణయించుకున్న తెలుగుదేశం
  • కాంగ్రెస్, మమత, స్టాలిన్‌, కేజ్రీవాల్‌ కూడా ఇదే ఆలోచన
  • ఈరోజు సాయంత్రం 3 గంటలకు సమావేశం

కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించ తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి విపక్ష పార్టీలు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘ఒకే దేశం...ఒకే ఎన్నికలు’ అనే అంశంపై చర్చించేందుకు అధికార బీజేపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాను రావడం లేదని స్పష్టం చేయగా, మరికొన్ని పార్టీలు కూడా ఆయనను అనుసరించాలని నిర్ణయించినట్లే తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ తోపాటు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తోపాటు తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌ సమావేశానికి గైర్హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనేది నిర్ణయించుకునేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు ఈరోజు సమావేశం అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఒకే దేశం...ఒకే ఎన్నికలు’ అన్నది ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన అంశం కావున సమావేశానికి హాజరు కాకూడదన్నది విపక్ష పార్టీల నిర్ణయంగా తెలుస్తోంది.

More Telugu News