Tamilnadu: పొలం దున్నుతుంటే బయటపడిన 17 పంచలోహ విగ్రహాలు, పీఠం... విలువ వందల కోట్లలోనే!

  • తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఘటన
  • వందల ఏళ్లనాటి విగ్రహాలు వెలుగులోకి
  • తవ్వకాలు సాగిస్తున్న అధికారులు

తొలకరి జల్లులు పడుతున్న వేళ, ఓ రైతు తన పొలాన్ని దున్నుతుంటే, పంచలోహ విగ్రహాలు బయటపడటం సంచలనం కలిగించింది. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా తిరుమయ్యం గ్రామంలో జరిగింది. పొలాన్ని చదును చేస్తుండగా, ఓ చెట్టు సమీపంలో పంచలోహ విగ్రహాలు బయట పడ్డాయని అతను అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే స్పందించిన అధికారులు, చెట్టును తొలగించి తవ్వకాలు జరుపగా, 17 పంచలోహ విగ్రహాలు, ఓ పీఠం బయటపడ్డాయి. వీటిని పరిశీలించిన పురావస్తు శాస్త్రవేత్తలు, ఇవి కొన్ని వందల సంవత్సరాల నాటివని, వీటి విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్ల విలువ పలుకుతుందని వెల్లడించారు. ఈ ప్రాంతంలో మరిన్ని విగ్రహాలు ఉండవచ్చన్న ఉద్దేశంతో తవ్వకాలు సాగిస్తున్నారు అధికారులు.

More Telugu News