Vellampalli Srinivas: ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ బోర్డు తొలగింపు: ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

  • ఈ ఉదయం తిరుమలకు వచ్చిన దేవాదాయ మంత్రి
  • భక్తుల్లో ఉన్న అన్ని అపోహలనూ తొలగిస్తాం
  • మీడియాతో వెల్లంపల్లి శ్రీనివాస్

ఓ ఆర్డినెన్స్ ను జారీ చేయడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును తొలగించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వయంగా తెలిపారు. బుధవారం ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.

 శ్రీవారి ఆభరణాల భద్రతపై భక్తులకు ఎన్నో అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తామని, త్వరలోనే ఈ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల కలకలం రేపిన బంగారం తరలింపు వ్యవహారంపై విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని తొలగిస్తామని, త్వరలో నూతన పాలకమండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వంశపారంపర్యంగా వస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి వున్నామని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

More Telugu News