England: మాంచెస్టర్ లో పరుగుల వర్షం... ఆఫ్ఘన్ బౌలింగ్ ను ఊచకోత కోసిన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్

  • ఆఫ్ఘన్ బౌలింగ్ కుదేల్
  • ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 397/6
  • మోర్గాన్ భారీ సెంచరీ

మాంచెస్టర్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ అతి భారీస్కోరు నమోదు చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కళ్లు చెదిరే బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బంతిని కసిదీరా బాదడమే పనిగా ఆడారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148) ఆఫ్ఘన్ బౌలర్లపై ఉగ్రరూపం ప్రదర్శించాడు. కనిపించిన ప్రతి బంతినీ స్టాండ్స్ లోకి పంపడమొక్కటే తన లక్ష్యం అన్నట్టుగా బ్యాట్ ఝుళిపించాడు.

ఈ క్రమంలో అరుదైన సిక్సర్ల వరల్డ్ రికార్డు కూడా మోర్గాన్ కు దాసోహమైంది. ఆఫ్ఘన్ బౌలర్లను బండ బాదుడు బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్ వన్డేల్లో ఒక ఇన్నింగ్స్ లో 17 సిక్సర్లతో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఇక, ఓపెనర్ బెయిర్ స్టో (90), జో రూట్ (88) సైతం ధాటిగా ఆడారు. చివర్లో వచ్చిన మొయిన్ అలీ సైతం ఆఫ్ఘన్ కూనలను వదిలిపెట్టలేదు. కేవలం 9 బంతుల్లోనే 1 ఫోరు, 4 సిక్సులతో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

More Telugu News