Narasaraopet: నరసరావుపేటలో డాక్టరు దంపతులపై దాడి.. వైసీపీ కార్యకర్తలపై ఆరోపణలు!

  • ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగింది
  • గన్ మన్ సాయంతో కార్యకర్తలు దౌర్జన్యం చేశారు
  • ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సీఐ బెదిరించారు

గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శ్రీకార్తీక్ ఆసుపత్రిపై దాడి జరిగింది. డాక్టర్ రమ్య దంపతులపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ దాడితో భయభ్రాంతులకు గురై ఆసుపత్రి నుంచి రోగులు బయటకు పరుగులు తీసినట్టు సమాచారం. ఈ దాడిలో ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసమైంది.

తమ ఆసుపత్రిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, ఎమ్మెల్యే గోపిరెడ్డి అండదండలతోనే ఈ దాడి జరిగిందని వైద్యురాలు రమ్య ఆరోపించారు. ఎమ్మెల్యే గన్ మన్ సాయంతో వైసీపీ కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. పోలీసులపైనా ఆమె ఆరోపణలు చేశారు. ఈ ఆసుపత్రి ఎలా నడుపుతారో చూస్తానని సీఐ బిలాలుద్దీన్ తమను బెదిరించారని రమ్య ఆరోపించారు.

More Telugu News