Cricket: పసికూనతో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్

  • ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • భారీ స్కోరుపై కన్నేసిన ఇంగ్లాండ్
  • 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు

ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మాంచెస్టర్ లో మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఈ టోర్నీలో తాను ఆడిన అన్ని మ్యాచ్ ల్లో ఓటమిపాలైన ఆఫ్ఘన్ కు బలమైన ఇంగ్లాండ్ తో మ్యాచ్ కఠినపరీక్ష అనడంలో సందేహంలేదు. ఓపెనర్ జాసన్ రాయ్ లేకపోయినా బెయిర్ స్టో, రూట్, బట్లర్, మోర్గాన్, స్టోక్స్ లతో తిరుగులేని బ్యాటింగ్ లైనప్ ఇంగ్లీష్ జట్టు సొంతం.

ఇక ఆఫ్ఘనిస్థాన్ విషయానికొస్తే, కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో అడపాదడపా సంచలనాలు నమోదు చేసినా, వరల్డ్ కప్ లో మాత్రం ఇప్పటివరకు ఆ ఛాయలు కనిపించలేదు. ఇంగ్లాండ్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంతో ఆఫ్ఘనిస్థాన్ లక్ష్యఛేదనలో అద్భుతాలు చేస్తుందన్న నమ్మకం ఎవరిలోనూ లేదు.

ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరుగుతున్న ఈ లీగ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఓపెనర్లు జానీ బెయిర్ స్టో 16, జేమ్స్ విన్స్ 14 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News