shar: శ్రీహరికోట 'షార్'లో భారీ అగ్నిప్రమాదం

  • ఘన ఇంధన మోటార్ల కెమికల్, ఫిజికల్ టెస్టింగ్ భవన్ లో ప్రమాదం
  • రూ. 5 కోట్ల వరకు నష్టం
  • గోప్యంగా ఉంచిన షార్ అధికారులు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష కేంద్రం (షార్)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ లో ఉన్న సాలిడ్ ప్రొపెల్లెంట్ ప్లాంట్ లో ఘన ఇంధన మోటార్ల కెమికల్, ఫిజికల్ టెస్టింగ్ భవన్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 5 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. కీలకమైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక దళాలు రెండున్నర గంటలసేపు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చాయి.

మరోవైపు, అగ్నిప్రమాదం జరిగిన విషయాన్ని షార్ అధికారులు గోప్యంగా ఉంచినట్టు సమాచారం. ఇస్రో కేంద్ర కార్యాలయానికి కూడా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. గత గురువారం సాయంత్రం ఈ ప్రమాదం సంభవించింది. రాత్రికి రాత్రే 100 మంది సిబ్బందితో పొగచూరిన భవనాన్ని కడిగించి, తెల్లారేసరికి కొత్తగా పెయింటింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ భవనానికి తాళం వేశారు.

More Telugu News