Teachers: మమతకు మరో తలనొప్పి.. మొదలైన టీచర్ల సమ్మె!

  • వైద్యులు సమ్మె విరమించిన కాసేపటికే మరో ఆందోళన
  • టీచర్లను అదుపు చేసేందుకు పోలీసుల లాఠీ చార్జ్
  • వేతనాలు పెంచాలంటూ ఈ నెల 12 నుంచి టీచర్ల ఆందోళన

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మరో తలనొప్పి మొదలైంది. ముఖ్యమంత్రితో సోమవారం సాయంత్రం జరిగిన చర్చలు సఫలం కావడంతో వారం రోజులుగా జరుగుతున్న సమ్మెను జూనియర్ వైద్యులు విరమించారు. అయితే, ఆ వెంటనే వేతనాల పెంపు కోరుతూ టీచర్లు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ వికాశ్ భవన్‌గా ప్రసిద్ధి చెందిన ఎడ్యుకేషన్ సెక్రటేరియట్‌ను ఉపాధ్యాయులు ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శిశు శిక్ష కేంద్ర (ఎస్ఎస్‌కే), మాధ్యమిక శిక్షణ కేంద్ర టీచర్లు-పోలీసుల మధ్య ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఉపాధ్యాయులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వికాశ్ భవన్‌లోని బెంగాల్ విద్యాశాఖ మంత్రిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటుచేసుకుంది.  

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12 నుంచి ఉపాధ్యాయులు ధర్నాలు చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా వేతనాలు పెరగలేదని, విద్యార్హతల ఆధారంగా వేతనాలు పెంచాలన్నది వారి డిమాండ్.

More Telugu News