Tollywood: హీరో శర్వానంద్ కు పదకొండు గంటల పాటు ఆపరేషన్ చేసిన వైద్యులు!

  • థాయ్ లాండ్ లో గాయపడిన శర్వా
  • వెంటనే హైదరాబాద్ తరలించిన '96' చిత్రబృందం 
  • రెండునెలల పాటు విశ్రాంతి తీసుకోమన్న వైద్యులు 

ఇది కాకతాళీయమే అయినా, టాలీవుడ్ యువ హీరోలు గత కొన్నిరోజులుగా గాయాలపాలవుతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. '96' సినిమా షూటింగ్ లో హీరో శర్వానంద్ కూడా గాయపడ్డాడు. ఈ సినిమాలో కొన్ని స్కై డైవింగ్ సీన్లు ఉన్నాయి. శర్వానంద్ ఆ సీన్లలో సులువుగా నటించడంకోసం థాయ్ లాండ్ లో శిక్షణ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది.

స్కై డైవింగ్ చేసే సమయంలో శర్వా సరైన పొజిషన్ లో ల్యాండ్ కాలేకపోయాడు. దాంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. ఈ నేపథ్యంలో, శర్వాను చిత్రబృందం వెంటనే హైదరాబాద్ తరలించగా ఇవాళ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 11 గంటలపాటు వైద్యులు శర్వానంద్ భుజానికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అయితే, శర్వా రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఎలాంటి షూటింగ్ లలో పాల్గొనకూడదని స్పష్టం చేశారు.

More Telugu News