beer: తెలంగాణలో రికార్డు స్థాయిలో బీర్ అమ్మకాలు

  • ఎండల నేపథ్యంలో బీర్లకు పెరిగిన గిరాకీ
  • మే నెలలో 61 లక్షల కేసుల అమ్మకం
  • ఏప్రిల్ లో 53 లక్షల కేసుల అమ్మకాలు

మండుతున్న ఎండల నేపథ్యంలో తెలంగాణలో బీర్ల అమ్మకాలు పాత రికార్డులను బద్దలు కొట్టాయి. మందుబాబులు బ్రాంది, విస్కీ వంటి వాటిని పక్కన పెట్టి బీర్లవైపు మొగ్గు చూపడంతో... బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మే నెలలోనే 61 లక్షల కేసుల బీర్లను తెలంగాణ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ అమ్మిందంటే... పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది మే నెలలో 57 లక్షల కేసులు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ లో 53 లక్షల కేసుల బీర్లను మందుబాబులు ఊదేశారు.

More Telugu News