Cricket: హాఫ్ సెంచరీలతో కదంతొక్కిన లూయిస్, హోప్... విండీస్ 156/2

  • టాస్ గెలిచిన బంగ్లాదేశ్
  • మొదట బ్యాటింగ్ కు దిగిన విండీస్
  • 13 బంతులాడి డకౌట్ గా వెనుదిరిగిన గేల్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో ఏ మ్యాచ్ కైనా వరుణుడు అడ్డం తగలకపోతే ఆశ్చర్యపోవాల్సిందే. ఇవాళ బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య టాంటన్ లో మొదలైన మ్యాచ్ కు ఇప్పటివరకైతే వరుణుడు ఎలాంటి అంతరాయం కలిగించలేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయానికి తగ్గట్టే స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ 13 బంతులు ఆడి ఒక్క పరుగూ చేయలేక డకౌట్ గా నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్ అద్భుతంగా ఆడి 70 పరుగులు చేయడం విశేషం. లూయిస్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ షై హోప్ తో కలిసి రెండో వికెట్ కు 116 పరుగులు జోడించాడు. ప్రస్తుతం విండీస్ స్కోరు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు. క్రీజులో హోప్ (53), నికొలాస్ పూరన్ (24) ఉన్నారు.

More Telugu News