rebr: ఇండియాలో టాప్ 10 కంపెనీలు ఇవే

  • జాబితాను విడుదల చేసిన ఆర్ఈబీఆర్
  • తొలి స్థానంలో అమెజాన్
  • 8వ స్థానానికి పరిమితమైన ఇన్ఫోసిస్

2019వ సంవత్సరానికి గాను భారత్ లో టాప్ 10 కంపెనీల జాబితాను ర్యాండ్ స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసర్చ్ (ఆర్ఈబీఆర్) విడుదల చేసింది. ఈ జాబితాలో అమెజాన్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కంపెనీపై ప్రజలకు ఉన్న నమ్మకం, సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునే విధానం ఈ సంస్థను తొలి స్థానంలో నిలబెట్టింది.

ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మైక్రోసాఫ్ట్ ఇండియా, సోనీ ఇండియా, మెర్సిడెస్ బెంజ్, ఐబీఎం, లార్సెన్ అండ్ టూబ్రో, నెస్లే, ఇన్ఫోసిస్, శాంసంగ్, డెల్ కంపెనీలు నిలిచాయి. భారత ఐటీ దిగ్గజం 8వ స్థానానికి పరిమితమవడం గమనార్హం. ఉద్యోగుల జీతభత్యాలు, ఉద్యోగుల సెక్యూరిటీ, కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల జీవితం మరియు వృత్తికి మధ్య ఉన్న బ్యాలెన్స్, జాబ్ సెక్యూరిటీ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ జాబితాను ఆర్ఈబీఆర్ రూపొందించింది.

More Telugu News