school: పాఠశాల మరుగుదొడ్డిలో తాచుపాము...అవాక్కయిన స్థానికులు

  • లోపలికి ప్రవేశించాక తలుపు వేయడంతో చిక్కుకున్న పాము 
  • స్థానికులను చూడగానే వెంటిలేటర్‌ నుంచి బయటపడే ప్రయత్నం
  • రంధ్రం చిన్నది కావడంతో చిక్కుకుని మృతి

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు ఉర్దూ పాఠశాలలోని మరుగుదొడ్డిలో ఆరడుగుల పొడవున్న తాచు పాము కనిపించడం స్థానికంగా సంచలనమైంది. ఎలా వచ్చిందోగాని మరుగు దొడ్డిలోకి ఈ పాము ప్రవేశించింది. ఈ విషయం తెలియక పాఠశాల సిబ్బంది దానికి తాళాలు వేశారు. లోపల చిక్కుకున్న పాము ఎటూ వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బుసలు కొట్టడం మొదలుపెట్టింది.

లోపలి నుంచి శబ్దాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపు తీసి షాక్‌కు గురయ్యారు. లోపల భారీ సైజులో ప్రమాదకరమైన తాచుపాము కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. స్థానికులను చూడగానే తాచుపాము కూడా తప్పించుకునే ప్రయత్నంలో పది అడుగు ఎత్తున్న వెంటిలేటర్‌ మీదికి చేరింది. అక్కడ ఉన్న ఓ రంధ్రం ద్వారా బయటకు వచ్చింది. సగం వరకు బయటకు రాగలిగినా పాము సైజ్‌ కంటే రంధ్రం చిన్నది కావడంతో మధ్యలో చిక్కుకుని చనిపోయింది. ఈ ఘటన పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది.  

More Telugu News