Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • విజయ్ తో జతకట్టనున్న రకుల్ 
  • యూరప్ తిరిగొచ్చిన మహేశ్ బాబు 
  • వినాయక్ నటించే సినిమా అప్ డేట్స్

*  అందాలతార రకుల్ ప్రీత్ సింగ్ కి మరో భారీ ఆఫర్ వచ్చింది. తమిళ స్టార్ హీరో విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రంలో కథానాయికగా రకుల్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  హీరో మహేశ్ బాబు ఇటీవల తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి యూరప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలలో పర్యటించారు. కాగా, ఈ పర్యటనను ముగించుకుని మహేశ్ ఫ్యామిలీ నిన్న హైదరాబాదుకు చేరుకుంది.
*  ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ తాజాగా ఓ చిత్రంలో హీరోగా నటించనున్నాడు. నరసింహారావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. తొలి షెడ్యూలు పది రోజుల పాటు జరుగుతుంది.

More Telugu News