Kishan Reddy: కేసీఆర్, జగన్ తండ్రీకొడుకుల్లా ఉండడం కాదు, రాష్ట్రాల మధ్య సమస్యల్ని కూడా పరిష్కరించుకోవాలి: కిషన్ రెడ్డి

  • ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం
  • విభజన హామీల అమలుకు కృషి చేస్తా
  • ప్రజల అభిప్రాయాన్నే కోమటిరెడ్డి చెప్పారు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సీఎంలు కేసీఆర్, జగన్ తండ్రీకొడుకుల మాదిరిగా ఉండడం కాదు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయం అని, అయితే, విభజన హామీల పరిష్కారానికి తనవంతు సహకారం అందిస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలపైనా ఆయన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తం చేశారని తెలిపారు. త్వరలోనే బీజేపీలోకి వలసలు మొదలవుతాయని, అవి నిరంతరం కొనసాగుతాయని జోస్యం చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News