Bihar: కేంద్రమంత్రి చూస్తుండగానే చిన్నారి మృత్యువాత... బీహార్ లో ప్రబలిన మెదడువాపు

  • బీహార్ లో ఇప్పటివరకు 82 మంది మృతి
  • పరిస్థితి సమీక్షించేందుకు వచ్చిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
  • చిన్నారి మృతితో చలించిపోయిన వైనం

బీహార్ లో ప్రమాదకర మెదడువాపు వ్యాధి తీవ్రస్థాయిలో విజృంభించింది. ఇప్పటివరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం 82 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం మెదడువాపు తీవ్రతకు నిదర్శనం. అయితే, ఓ ఆసుపత్రిలో మెదడువాపు బాధిత చిన్నారులను పరామర్శించేందుకు వెళ్లిన కేంద్రమంత్రికి దిగ్భ్రాంతికర అనుభవం ఎదురైంది. ముజఫర్ పూర్ లోని శ్రీకృష్ణ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో మెదడువాపు బాధిత చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు.

పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఒక్కో చిన్నారిని పరామర్శించుకుంటూ వెళుతుండగా, ఓ బెడ్ పై ఉన్న చిన్నారి నరకయాతన పడుతూ మంత్రి కళ్లెదురుగానే ప్రాణాలు విడిచాడు. ఈ పరిణామంతో కేంద్రమంత్రి తీవ్రంగా చలించిపోయారు. బీహార్ లో నిత్యం పదుల సంఖ్యలో పిల్లలు మృత్యువాత పడుతుండడం నితీశ్ కుమార్ సర్కారును కలచివేస్తోంది. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు.

More Telugu News