Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీరు అందిచేందుకు చర్యలు: బాలినేని

  • రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్,  నిమ్జ్ పనులపై సమీక్ష
  • వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం
  • విద్యుత్ శాఖలో అవకతవకలపై సమీక్షిస్తాం

ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్, జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల మండలి (నిమ్జ్) పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఉందని అన్నారు. ఒంగోలు, మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని అన్నారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, విద్యుత్ శాఖలో అవకతవకలపై సమీక్షిస్తామని చెప్పారు.

More Telugu News