TRS: ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ అర్థాలు మారాయి : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

  • తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారు
  • అవినీతికి కేరాఫ్‌గా కాళేశ్వరం ప్రాజెక్టు
  • కొత్త ప్రభుత్వంలో చుక్కనీరిచ్చే ప్రయత్నం జరగలేదు

రాష్ట్ర సాధనకు ముందు, సాధించిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ వంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు వాటి సంగతి పక్కనపెట్టి అవినీతిలో మునిగి తేలుతున్నారని తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రం ఉప సభాపతిగా విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరుతాయని ఆశించానన్నారు. కానీ నూతన రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలు నిస్పృహతో ఉన్నారన్నారు.

ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాని ద్వారా ఎన్ని ఎకరాలకు నీరిస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. కాళేశ్వరం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఎండగట్టారు. 15 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ప్రారంభిస్తున్నారంటే తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు. 15 శాతం పనులకే 50 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 85 శాతం పనులకు ఎంత కావాలో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

More Telugu News