Suman Rao: మిస్ ఇండియా 2019గా రాజస్థాన్ అమ్మాయి సుమన్ రావ్.. రన్నరప్‌గా తెలంగాణ అమ్మాయి

  • అట్టహాసంగా ఫెమీనా మిస్ ఇండియా 2019 ఫైనల్
  • మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్‌గా బీహార్ గాళ్
  • మిస్ వరల్డ్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న సుమన్ రావ్

56వ ఫెమీనా మిస్ ఇండియా 2019 పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల సుమన్ రావ్ విజేతగా నిలిచింది. తమిళనాడుకు చెందిన మిస్ ఇండియా 2018 అనుక్రీతి వాస్.. సుమన్‌కు కిరీటం తొడిగింది. ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన సంజన విజ్ రన్నరప్‌గా నిలిచింది. బీహార్‌కు చెందిన శ్రేయ శంకర్ మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా ఎన్నికైంది. ఈ కార్యక్రమానికి హుమా కురేషీ, దియా మీర్జా, చిత్రాంగద సింగ్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, విక్కీ కౌశల్, మిస్ ఇండియా వరల్డ్ 2017 మానుషి చిల్లార్‌లు హాజరయ్యారు.

నటి కత్రినాకైఫ్, విక్కీ కౌశల్, మౌనీ రాయ్, నోరా ఫెతాహీ తదితరులు తమ డ్యాన్స్ ఫెర్మార్మెన్స్‌తో కార్యక్రమానికి సొబగులు అద్దారు. కాగా, మిస్ ఇండియాగా ఎన్నికైన సుమన్ ఈ ఏడాది డిసెంబరు 7న థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరగనున్న మిస్ వరల్డ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.

More Telugu News