Pakistan: ఆదమరిస్తే అంతే... పాక్ తో మ్యాచ్ పై గంగూలీ కీలక వ్యాఖ్యలు!

  • పాకిస్థాన్ జట్టు అత్యంతప్రమాదకారి
  • ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలీదు
  • 2017 చాంపియన్స్ ట్రోఫీ గుర్తుంచుకోండి
  • టీమిండియాకు గంగూలీ హెచ్చరిక

పాక్ క్రికెట్ జట్టు అత్యంత ప్రమాదకారని, ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పాక్ తో అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీమిండియాకు సూచించాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. పాక్ ను ఎంతమాత్రమూ తేలికగా తీసుకోవద్దని, ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలని సూచించాడు. తామే ఫేవరెట్ అనుకుని మాత్రం బరిలోకి దిగవద్దని సూచించిన గంగూలీ,  ఆదమరిస్తే పాకిస్థాన్ జట్టు ఎంత బలమైన ప్రత్యర్థినైనా దెబ్బతీస్తుందన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలని హెచ్చరించాడు.

2017లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తామే ఫేవరెట్ అనుకుని బరిలోకి దిగి బోల్తా పడిందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడు. కాగా, నేడు మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానం వేదికగా, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి వరుణుడి ముప్పు కూడా పొంచివుంది.

More Telugu News