Facebook: ఫేస్ బుక్ లైవ్ లో 'క్యాట్ ఫిల్టర్'... మంత్రికి పిల్లి ముఖం!

  • నిర్ణయాలపై సమీక్షించిన పాక్ మంత్రులు
  • మీడియా సమావేశం ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం
  • పిల్లి తల, మీసాలు చూసి వ్యంగ్యాస్త్రాలు

పాకిస్థాన్‌ కు చెందిన మంత్రి ఒకరు, ప్రెస్ మీట్ ను నిర్వహిస్తూ, దాన్ని ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసి అబాసుపాలయ్యారు. ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రుల సమీక్ష జరుగగా, ఆ వివరాలను సౌఖత్‌ యూసఫ్‌ జాయ్‌ వెల్లడించారు. దీన్ని ఫేస్‌ బుక్‌ లో లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు.

అంత వరకు ఓకే. మీటింగ్ జరుగుతూ ఉండగా, ఎప్పుడు ఆన్ అయిందో తెలియదుగానీ,  'క్యాట్‌ ఫిల్టర్‌' ఆన్ అయిపోయింది. దీంతో మంత్రి తలపై పిల్లి చెవుల స్టిక్టర్లు వచ్చేశాయి. మూతిపై మీసాలు మొలిచాయి. దీంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోయారు. వ్యంగ్యంగా కామెంట్లు సంధించారు. ఇక దీన్ని చూసిన ఇండియన్స్, ఈ పిల్లి క్యూట్ గా ఉందని, పాక్ వక్రబుద్ధి ఫేస్ బుక్ కు కూడా తెలిసిందని వ్యాఖ్యానిస్తున్నారు.

More Telugu News