Cricket: లంక బౌలర్లను ఊచకోత కోసిన ఆరోన్ ఫించ్... ఆసీస్ 334/7

  • 15 ఫోర్లు, 5 సిక్స్ లతో విరుచుకుపడిన ఆసీస్ కెప్టెన్
  • స్మిత్ అర్ధసెంచరీ
  • మ్యాక్స్ వెల్ మెరుపుదాడి

వరల్డ్ కప్ లో వరుణుడి కారణంగా కొంత నిరుత్సాహం ఏర్పడినా, ఇవాళ ఆసీస్ దూకుడైన బ్యాటింగ్ తో క్రికెట్ మేనియా మళ్లీ కనిపించింది. లండన్ వేదికగా శ్రీలంకతో జరిగిన పోరులో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ భారీ సెంచరీ చేసే క్రమంలో శ్రీలంక బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. ఫించ్ 132 బంతుల్లో 15 ఫోర్లు, 5 భారీ సిక్సులతో 153 పరుగులు చేశాడు. మరోవైపు, స్టీవెన్ స్మిత్ 59 బంతుల్లో 73, గ్లెన్ మ్యాక్స్ వెల్ 25 బంతుల్లో 46* పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. అంతకుముందు, టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే, ఆసీస్ భారీ స్కోరు సాధించి ఆ నిర్ణయం ఎంత పొరబాటో నిరూపించింది.

More Telugu News