nagarjuna: నా పేరుతో తప్పుడు అకౌంట్ ఓపెన్ చేశారు: నాగార్జున

  • నాగార్జున పేరుతో ఇన్స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్
  • తన అఫీషియల్ అకౌంట్ కాదన్న నాగ్
  • ఇన్స్టాలోకి రావాలనుకుంటే అందరికీ చెబుతానంటూ వ్యాఖ్య

సినిమాలు, వ్యాపారాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో నాగార్జున యాక్టివ్ గా ఉంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే, నాగార్జున పేరుతో ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయింది. ఆ అకౌంట్ నుంచి కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు.

ఇది తన అఫీషియల్ అకౌంట్ కాదని స్పష్టం చేశారు. తాను ఇన్స్టాగ్రామ్ లోకి రావాలనుకుంటే స్వయంగా అందరికీ తెలియజేస్తానని చెప్పారు. ప్రస్తుతం 'మన్మథుడు-2' సినిమా షూటింగ్ లో నాగార్జున బిజీగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

More Telugu News