maoist: మావోయిస్టుల చేతిలో పాకిస్థాన్ ఆయుధాలు.. కలకలం

  • గురువారం రాత్రి నలుగురు మావోలను మట్టుబెట్టిన భద్రతాబలగాలు
  • పాకిస్థాన్ ఆర్మీ ఉపయోగించే రైఫిల్స్ స్వాధీనం
  • పాక్ ఆర్మీతో మావోలకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభం

ఛత్తీస్ గఢ్ లో గురువారం రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు మావోయిస్టులను భద్రతాబలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను కూడా భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ ఆయుధాలను పరిశీలించిన అధికారులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే అవి పాకిస్థాన్ ఆర్మీ, నాటో దళాలు ఉపయోగించే కోచ్ జీ3, హెక్లెర్ రైఫిల్స్ కావడమే కారణం. ఈ నేపథ్యంలో, భద్రతాదళాల అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఆయుధాలు మావోలకు ఎలా చేరాయి? పాక్ ఆర్మీతో మావోలకు ఉన్న సంబంధాలు ఏమిటనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఒక అధికారి మాట్లాడుతూ, పాక్ ఆర్మీ ఉపయోగించే ఆయుధాలను మావోల నుంచి స్వాధీనం చేసుకున్నామని, ఇతర దేశాలకు చెందిన వారు ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారని తెలిపారు. గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోల నుంచి జర్మనీలో తయారైన రైఫిల్ ను, అమెరికాలో తయారైన సబ్ మెషిన్ గన్ ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

More Telugu News