Andhra Pradesh: చంద్రబాబు బీసీల ద్రోహి.. అందుకే తమ్మినేనిని చైర్ లో కూర్చోబెట్టేందుకు రాలేదు!: మంత్రి శంకర్ నారాయణ

  • టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూసింది
  • కానీ జగన్ మాత్రం పదవులు ఇచ్చి సముచితస్థానం కల్పించారు
  • మీడియాతో మాట్లాడిన ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు బీసీల ద్రోహి అని ఆయన ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ అయితే ఆయన్ను కుర్చీవరకూ తీసుకెళ్లేందుకు కూడా చంద్రబాబు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మొదటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందనీ, కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇచ్చిన హామీకి కట్టుబడి బీసీలకు పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు.  సీఎం జగన్  బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకే 60 శాతం పదవులు కేటాయించారని పేర్కొన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేలు ఇవ్వాలన్న ఫైలుపై తాను తొలి సంతకం పెట్టాననీ, వచ్చే కేబినెట్ భేటీలో దీని విధివిధానాలను ఖరారు చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు.

More Telugu News