Peddineni Sai Teja: మండుతున్న అగ్నిపర్వతాన్ని అధిరోహించే సాహసం... తీవ్రగాయాలపాలైన హైదరాబాద్ యువకుడు

  • ఇండోనేషియాలో ప్రమాదం
  • ఆసుపత్రిపాలైన పెద్దినేని సాయితేజ
  • 2014 నుంచి అగ్నిపర్వతాలు అధిరోహిస్తున్న వైనం

హైదరాబాద్ కు చెందిన పెద్దినేని సాయితేజ ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. సాయితేజ ఓ మిత్రుడి సలహా మేరకు ఇండోనేషియాలో నిత్యం రగులుతూ ఉండే అగుంగ్ అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని నిర్ణయించుకున్నాడు. ఇది చాలా ప్రమాదకరమైన వాల్కనో. 60వ దశకంలో ఇక్కడ పెద్ద విస్ఫోటనం సంభవించి 1500 మంది వరకు చనిపోయారు. అలాంటి అగ్నిపర్వతాన్ని అధిరోహించే క్రమంలో సాయితేజ సరైన అంచనాలు రూపొందించుకోవడంలో విఫలమయ్యాడు.

ఆ పర్వతాన్ని సరైన దిశలో అధిరోహించడంలో పొరబడ్డాడు. క్లిష్టమైన మార్గంలో వెళ్లడంతో మండుతున్న లావా ఎదురైంది. ఈ క్రమంలో తప్పించుకోలేక గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం సాయితేజ ఇండోనేషియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయితేజకు సాహసాలంటే మక్కువ. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపనతో 2014 నుంచి ప్రపంచంలోని అనేక ప్రముఖ అగ్నిపర్వతాలను అధిరోహిస్తున్నాడు. రెండేళ్లలో 12 పర్యాయాలు వాల్కనో ట్రెక్కింగ్ చేశాడు.

More Telugu News