'కిల్లర్' హిట్ కొట్టేసింది: యాక్షన్ కింగ్ అర్జున్

15-06-2019 Sat 12:46
  • విజయ్ ఆంటోని వలన ఈ సినిమా చేశానన్న అర్జున్ 
  • 60 థియేటర్లు పెరగడమే సినిమా సక్సెస్ కి నిదర్శనం 
  • క్రెడిట్ అంతా కూడా దర్శకుడికే చెందుతుంది
'బిచ్చగాడు' భారీ హిట్ తరువాత తమిళంలో విజయ్ ఆంటోనీ చేసిన చాలా సినిమాలు తెలుగులోను విడుదలయ్యాయి. అయితే ఆ సినిమాలేవీ ఆయనకి సక్సెస్ ను తీసుకురాలేదు. నిర్మాతగాను ఆయన నష్టాల పాలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో హిట్ లభించడంతో విజయ్ ఆంటోనీ ఫుల్ ఖుషీ అవుతున్నాడు.

'కొలై గారన్' టైటిల్ తో తమిళంలో నిర్మితమైన ఈ సినిమాను, తెలుగులో 'కిల్లర్' పేరుతో ఈ నెల 7వ తేదీన విడుదల చేశారు. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సినిమాలో కీలకమైన పాత్రను పోషించిన యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ, "విజయ్ ఆంటోని వలన నేను ఈ సినిమాను చేశాను. రెండవ వారంలో 60 థియేటర్స్ పెరగడం ఈ సినిమా రియల్ సక్సెస్ అనే విషయాన్ని చెబుతోంది. ఈ క్రెడిట్ అంతా కూడా దర్శకుడు ఆండ్ర్యూ లూయిస్ కి చెందుతుంది. ఈ సినిమాను ఈ స్థాయిలో ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు.