trains cancel: గుంటూరు-దొనకొండ సెక్షన్‌లో ఆరు రోజులపాటు పలు ప్యాసింజర్‌ రైళ్ల రద్దు

  • నిర్వహణ పనుల కారణంగా అధికారుల నిర్ణయం
  • ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు వర్తింపు
  • కొన్ని రైళ్ల సమయాల్లో మార్పులు

గుంటూరు-దొనకొండ సెక్షన్‌లో నిర్మాణ పనుల కారణంగా ఈ రూట్‌లో తిరిగే పలు ప్యాసింజరు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సెక్షన్‌లోని రూట్లలో ఆర్‌సీసీ బ్లాకులు, రైలు పట్టాల మార్పిడి పనుల కారణంగా ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆరు రోజులపాటు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు, కొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం వాసుదేవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

రద్దయిన రైళ్ల వివరాలు.. గుంటూరు - డోన్‌ ప్యాసింజర్‌(నంబర్‌ 57328)ను16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, డోన్‌ - గుంటూరు ప్యాసింజర్‌(నంబర్‌ 57327) ను ఈనెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే రేపల్లె - మార్కాపురం రోడ్డు ప్యాసింజర్‌ (నంబర్‌ 77247) ఈ నెల 17, 21 తేదీల్లో గుంటూరు వరకే నడుస్తుంది. మార్కాపురం రోడ్డు - తెనాలి ప్యాసింజర్‌ (నంబర్‌ 77249) ఈ నెల 17, 21 తేదీల్లో గుంటూరు నుంచి నడుస్తుంది. హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్‌ (నంబర్‌ 56502)ను ఈ నెల 17న 15 నిమిషాలు, 21వ తేదీన 45 నిమిషాల పాటు మార్గమధ్యంలో నిలిపివేస్తారు.

More Telugu News