Tollywood: డూప్ లేకుండా యాక్షన్ సీన్.. నటుడు నాగశౌర్యకు గాయాలు

  • ఐరా క్రియేషన్స్ పతాకంపై చిత్ర నిర్మాణం
  • రోప్, డూప్ సాయం లేకుండా యాక్షన్ సన్నివేశాలు
  • మూడు వారాలు విశ్రాంతి అవసరమన్న వైద్యులు

టాలీవుడ్ నటుడు నాగశౌర్య గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించిన ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్ విశాఖలో శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతుండగా నాగశౌర్య రోప్, డూప్ సాయం లేకుండా నటించారు. ఈ క్రమంలో పట్టుతప్పిన ఆయన కిందపడ్డాడు. ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆయనను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు భయపడాల్సిన అవసరం లేదని, అయితే, మూడు వారాలపాటు విశ్రాంతి అవసరమని చెప్పినట్టు తెలుస్తోంది.  

More Telugu News