TV9: రవిప్రకాశ్ వాడుతున్న కార్లను స్వాధీనం చేసుకున్న అలంద మీడియా!

  • గతంలో కార్లను కేటాయించిన టీవీ9 యాజమాన్యం
  • కోర్టును ఆశ్రయించిన అలంద
  • కార్లు స్వాధీనం చేసుకోవాలంటూ కోర్టు ఆదేశాలు

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు మరో ఎదురుదెబ్బ అని చెప్పే సంఘటన జరిగింది. గతంలో టీవీ9 యాజమాన్యం రవిప్రకాశ్ కు ఎంతో ఖరీదైన కార్లను కేటాయించింది. అయితే, ఉద్యోగం నుంచి తొలగించినా గానీ, రవిప్రకాశ్ ఆ కార్లను ఉపయోగిస్తున్నాడంటూ టీవీ9 ప్రస్తుత యాజమాన్యం అలంద మీడియా కోర్టును ఆశ్రయించింది. దాంతో, ఆ వాహనాలు అలంద మీడియా పరం చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, పోలీసులు రవిప్రకాశ్ నివాసంలోని కార్లను సీజ్ చేశారు. డ్రైవర్ల ఫోన్లను కూడా తీసేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, నోటీసులు ఇవ్వకుండా ఇంటికి వచ్చి కార్లను ఎలా సీజ్ చేస్తారంటూ రవిప్రకాశ్ భార్య పోలీసులను ప్రశ్నించినట్టు సమాచారం.

More Telugu News