Amit Shah: మంచి రుచి, బరువు ఉండే మామిడిపండుకు 'అమిత్ షా' పేరు!

  • మామిడి నిపుణుడు హాజీ కలీముల్లా మరో సృష్టి
  • త్వరలోనే మార్కెట్లోకి
  • గతంలో ఒక మామిడిచెట్టుకు 300 రకాల కాయలు!

ఫలాల్లో మామిడిపండు రుచే వేరు. అందుకే దీన్ని ఫలరాజు అంటారు. మార్కెట్లో ఎన్నోరకాల మామిడిపండ్లు ప్రజలను ఊరిస్తుంటాయి. కాగా, ఉత్తరప్రదేశ్ మలీహాబాద్ కు చెందిన హాజీ కలీముల్లా అనేక రకాల హైబ్రిడ్ మామిడిపండ్లను రూపొందించారు. పాతరకాలను సంకరం చేసి కొత్త రకాల మామిడిపండ్లను అందించడంలో కలీముల్లాది అందెవేసిన చేయి. ఆయన గతంలో రూపొందించిన ఓ మామిడిచెట్టుకు 300 రకాల కాయలు కాయడం ఓ అద్భుతంగా చెప్పుకుంటారు.  

తాజాగా, ఆయన ఎంతో రుచికరమైన మరో కొత్త రకం మామిడిఫలానికి రూపకల్పన చేశారు. అయితే, దానికి 'అమిత్ షా' అని పేరు పెట్టారు. ఆ మామిడి పండుకు బీజేపీ చీఫ్ పేరుపెట్టడానికి కలీముల్లా చెప్పిన కారణమేంటో చూడండి! "ఈ మామిడి పండు మంచి రుచితో పాటు తగిన బరువు కూడా ఉంటుంది. త్వరలోనే షా మామిడి పండ్లను మార్కెట్లోకి తీసుకువస్తాం. ఇది తప్పకుండా అమిత్ షాకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాం" అని తెలిపారు.

More Telugu News