Amitabh Bachchan: ఇండియాకు వర్షాల అవసరం చాలా ఉంది.. వరల్డ్ కప్‌ను షిఫ్ట్ చేయండి: అమితాబ్ బచ్చన్ సెటైర్

  • ప్రతి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిపై సెటైర్లు
  • ఇప్పటికే రద్దైన నాలుగు మ్యాచ్‌లు
  • భారత్-పాక్ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌కు వర్షం తీవ్ర అడ్డంకిగా మారుతోంది. భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షార్పణం కావడంతో ఇప్పటికి రద్దైన మ్యాచ్‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. ప్రపంచకప్ చరిత్రలోనే వర్షం కారణంగా ఇన్ని మ్యాచ్‌లు రద్దవడం ఇదే తొలిసారి. ప్రతి మ్యాచ్‌కు ఇలా వర్షం అడ్డంకి కావడంపై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.

భారత్-కివీస్ మ్యాచ్ రద్దుపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చాలా ఫన్నీగా స్పందించారు. ‘మాకు వర్షాల అవసరం చాలా ఉంది. వరల్డ్ కప్‌ 2019ను ఇండియాకు షిఫ్ట్ చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం భారత్, పాకిస్థాన్‌‌ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ దానికి కూడా వాన ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చల్లగా చెప్పింది. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. భారత్, పాక్ మ్యాచ్ అంటే ఈ రెండు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఆసక్తిని చూపిస్తుంది. అలాంటిది ఆ మ్యాచ్ జరగదేమో అన్న ఆందోళన క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతోంది.

More Telugu News