sensex: నష్టాలతో వారాన్ని ముగించిన మార్కెట్లు

  • బ్యాంకింగ్, టెలికాం, ఆటో సెక్టార్లకు అమ్మకాల ఒత్తిడి
  • 289 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 90 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే హెల్త్ కేర్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆ తర్వాత ఈ ఒత్తిడి బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, ఆటో సెక్టార్లకు కూడా విస్తరించడంతో... మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 289 పాయింట్లు నష్టపోయి 39,452కి పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్లు కోల్పోయి 11,823కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (0.80%), వేదాంత లిమిటెడ్ (0.74%), సన్ ఫార్మా (0.58%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.44%), టీసీఎస్ (0.09%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.36%), భారతి ఎయిర్ టెల్ (-2.74%), యాక్సిస్ బ్యాంక్ (-2.39%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-2.10%), టాటా మోటార్స్ (-1.97%).

More Telugu News