Telugudesam: విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం: చంద్రబాబు ఆధ్వర్యంలో భేటీ

  • సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై చర్చ
  • భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం
  • కార్యకర్తలపై దాడులపైనా చర్చ

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఈరోజు జరగనుంది. విజయవాడలోని ఎ1 కన్వెన్షన్‌ సెంటర్‌లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ ఉమ్మడి సభల సమావేశం పూర్తయినందున మధ్యాహ్న భోజనానంతరం ఈ సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పార్టీ ముఖ్యులు, ప్రధాన, ద్వితీయ శ్రేణి నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించి విశ్లేషించనున్నారు. ఓటమికి ఏఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఏఏ ప్రాంతాల్లో ఏ పరిస్థితులు కారణంగా ఓడిపోయాం, ఇందులో స్వీయ తప్పిదాలెన్ని, ప్రభుత్వ పరంగా జరిగిన తప్పిదాలేమిటి? వంటి అంశాలపై కూలంకుషంగా చర్చించనున్నారు. అనంతరం భవిష్యత్తులో పార్టీ పటిష్టానికి ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను నివారించేందుకు అధికార పార్టీపై ఒత్తిడి తేవాలని, బాధ్యులకు శిక్షపడేందుకు ఏం చేయాలన్న అంశాలపైనా చర్చిస్తారని తెలుస్తోంది.

More Telugu News