chattisgarh: చత్తిస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌...ఇద్దరు మావోయిస్టుల మృతి

  • ముర్నార్‌ అటవీ ప్రాంతంలో ఘటన
  • భద్రతా బలగాల కూంబింగ్‌ సందర్భంగా కాల్పులు
  • ఘటనా స్థలి నుంచి తుపాకులు స్వాధీనం

చత్తిస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లా తడోకీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముర్నార్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎప్పటిలాగే ముర్నార్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. కాసేపటికి మావోయిస్టులు పారిపోయారు.

అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలిని పరిశీలించగా ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం గుర్తించారు. అలాగే, వారికి సమీపంలో రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, 303, 315 తుపాకులు పడి వుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని తూర్పుగోదావరి సరిహద్దులోనూ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎవరూ చనిపోకపోయినా పెద్ద సంఖ్యలో తుపాకులు, ఆరు కిట్‌ బ్యాగులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

More Telugu News