Andhra Pradesh: ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందన్న గవర్నర్

  • ప్రారంభమైన మూడోరోజు సమావేశాలు
  • ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్
  • కొత్త ప్రభుత్వానికి అభినందనలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మూడోరోజు సమావేశాలు ప్రారంభం కాగా గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తొలుత కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన గవర్నర్.. సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షించి ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి ఉందని స్ఫష్టం చేశారు.

తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా పనిచేస్తుందని, ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావు ఉండదని పేర్కొన్నారు. జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ప్రభుత్వ టెండర్లలో అవినీతికి తావులేకుండా, లోపాయికారీ ఒప్పందాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, అవి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్‌లో పెడతామని వివరించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఈ కమిషన్ పరిశీలించి టెండర్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను తిరిగి ప్రజల ముందుకు తీసుకొస్తామని, వాటి అమలులో జాతి, కులమత భేదాలకు తావుండదని గవర్నర్ స్పష్టం చేశారు.

More Telugu News