India: భారత్‌తో మాకున్నది అదొక్కటే సమస్య: పాక్ ప్రధాని ఇమ్రాన్

  • మోదీ తన మెజారిటీని శాంతి చర్చల కోసం ఉపయోగించాలి
  • కశ్మీర్ తప్ప ఆ దేశంతో మాకు విభేదాలు లేవు
  • ఎన్నికల సమయంలో భారత్‌లో పాక్ వ్యతిరేక భావాలు

భారత్‌తో తమకు పెద్దగా ఎటువంటి సమస్యలు లేవని, ఆ దేశంతో తాము విభేదించేది ఒక్క కశ్మీర్ అంశంలోనేనని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ గొప్ప మెజారిటీతో విజయం సాధించారని, దానిని ఇరు దేశాల మధ్య సత్సంబంధాల కోసం, శాంతి సామరస్యాల కోసం వినియోగిస్తారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని, చర్చల వల్ల కశ్మీర్ వంటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఇమ్రాన్ పేర్కొన్నారు.  

నిజానికి భారత్‌లో ఎన్నికలు జరగడానికి ముందు నుంచీ చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని, అయితే, ఎన్నికల సమయంలో భారత్‌లో పాక్ వ్యతిరేక భావాలు నెలకొన్నాయని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి పాక్ ఇస్తున్న అవకాశాన్ని భారత్ వినియోగించుకుంటుందని భావిస్తున్నట్టు ఇమ్రాన్ పేర్కొన్నారు.

More Telugu News