Social Media: అసత్య ప్రచారం చేస్తున్న యువసైన్యం ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్‌పై కేసు.. ముగ్గురి అరెస్ట్

  • మహిళలు, పిల్లల అపహరణ అంటూ దుష్ప్రచారం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచన
  • పుకార్లను ప్రజలు నమ్మవద్దని కోరిన డీజీపీ

తెలంగాణలో జరుగుతున్న మిస్సింగ్‌లపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ యువ సైన్యం ఫేస్‌బుక్ పేజీ అడ్మిన్‌పై కేసు నమోదు చేసి క్రాంతి కిరణ్, వెంకట్, బాలరాజులను అరెస్ట్ చేశారు. తెలంగాణలో మహిళలు, పిల్లలు అపహరణకు గురవుతున్నారంటూ దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మిస్సింగ్ కేసుల్లో ఎక్కువగా ప్రేమ వ్యవహారం, పరీక్షల్లో ఫెయిల్ అవడం, కుటుంబం, తల్లిదండ్రులు కుటుంబ సంరక్షణ దొరక్క వెళ్లిపోవడం, పిల్లలు తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోవడం వంటి కారణాల వల్లే జరుగుతున్నాయని మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని కోరారు.

More Telugu News